సుశాంత్‌ కేసు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా?

AIIMS Team Submits Report to CBI - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌  కేసు ఇక క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తిని విచారిస్తున్న సీబీఐకు ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ విభాగం కొన్ని రిపోర్టులను అందించింది. సోమవారం ఉదయం 11గంటల సమయంలో ఎయిమ్స్‌కు చెందిన నలుగురు ఎయిమ్స్‌ వైద్యులు సీబీఐ అధికారులను కలిసి వారికి రిపోర్టులు అందించారు. వారి మధ్య దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. సుశాంత్‌ మరణించిన సమయంలో అతని ఇంటికి దగ్గరలో ఉన్న కూపర్‌ ఆసుపత్రిలో సుశాంత్‌ పంచనామా నిర్వహించారు.

అనంతరం ఈ కేసును రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సీబీఐ పోస్ట్‌మార్టం రిపోర్టు విషయంలో సహకరించాలని ఎయిమ్స్‌ను కోరింది. దీంతో రంగంలోకి దిగిన ఎయిమ్స్‌ ఫోరెన్సిక్‌ బృందం సుశాంత్‌ ఇంటిని కూడా పరిశీలించింది. సుశాంత్‌ మరణం వెనుక ఏదైనా కుట్రదాగుందా, ఇది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో ఎయిమ్స్‌ వైద్యులు రిపోర్టును, సుశాంత్‌ మరణించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం  సీబీఐకి తన రిపోర్టును అందించారు. ఇక సుశాంత్‌ కేసులో డ్రగ్స్‌ కోణం వెలుగులోకి రావడంతో సీబీఐతో పాటు ఎన్‌సీబీ కూడా రంగంలోకి దిగి పలువురును విచారిస్తోంది. ఈ డ్రగ్స్‌ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు, బాలీవుడ్‌ సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్‌సీబీ  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top