
అభిమాన హీరో కళ్ల ముందు కనిపిస్తే చాలు సెల్ఫీలంటూ ఎగబడతారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతుళ్లు అదితి, ఐశ్వర్య కూడా అదే పని చేశారు. తండ్రితో కలిసి షూటింగ్‌కు వెళ్లినప్పుడు ఓ హోటల్ దగ్గర ఆగారు. అక్కడ మహేశ్‌బాబు (Mahesh Babu)ను చూడగానే సెల్ఫీ అంటూ అతడి ముందు వాలిపోయారు. అయితే వీళ్లు శంకర్ కూతుర్లని తెలీక.. ఫ్యామిలీతో ఉన్నాను.. ఇప్పుడు సెల్ఫీ ఇవ్వడం కుదరదని పంపేశాడు.
అదితితో సెల్ఫీకి నో చెప్పిన మహేశ్
దీంతో వాళ్లు నిరాశగా వెనుదిరిగారు. ఇదంతా చూసిన డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh).. వెంటనే హీరో దగ్గరకు వెళ్లి.. ఆ అమ్మాయిలు ఎవరన్న విషయం చెప్పడంతో అతడు నాలుక్కరుచుకున్నాడు. శంకర్ దగ్గరకు వెళ్లి.. మీ కూతుర్లని తెలీక అలా చేశానని మహేశ్ సారీ చెప్పాడు. అందుకు శంకర్.. హీరోలంటే ఎలా ఉండాలో వాళ్లక్కూడా తెలియాలి కదా అని రిప్లై ఇచ్చాడు. శంకర్ కూతుర్లు చాలా సింపుల్‌గా ఉంటారంటూ మహేశ్‌బాబు ఈ సంఘటనను అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో వెల్లడించాడు.
మహేశ్‌కు సారీ చెప్పిన శంకర్ కూతుర్లు
తాజాగా ఇదే సంఘటనను అదితి శంకర్ (Aditi Shankar) ఓ యూట్యూబ్ ఛానల్‌లో గుర్తు చేసుకుంది. నాన్న సినిమా కోసం మేమందరం ఓ చోటుకు వెళ్తున్నాం. దారిలో ఓ హోటల్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగాం. అక్కడ మహేశ్‌బాబు ఉన్నారు. నేను, నా సోదరి ఆయనకు అభిమానులం. మేము తన దగ్గరకు వెళ్లి ఓ ఫోటో అడిగాం. అందుకాయన.. ఇప్పుడు ఇవ్వలేనమ్మా అని తిరస్కరించారు. డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్పి వెళ్లిపోయాం.
వీడియో వైరల్
అప్పుడు మహేశ్ బాడీగార్డ్ వెళ్లి.. మేము శంకర్ కూతుర్లమని చెప్పాడు. దాంతో ఆయన మేమున్న టేబుల్ దగ్గరకు వచ్చి మీ కూతుర్లని తెలీదు సర్ అని వివరణ ఇచ్చుకున్నాడు. పర్లేదు.. హీరో ఎలా ఉంటారో వారికి తెలియాలి. అయినా వాళ్లకు ఫోటో కావాలంటే నీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇస్తావా? లేదా? అనేది నీ నిర్ణయం అని నాన్న అన్నాడు. ఏదో తెలీక నో చెప్పానంటూనే మహేశ్ మాతో ఫోటో దిగాడు అని అదితి చెప్పుకొచ్చింది. ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. పాపం, మెహర్ రమేశ్‌ను మహేశ్‌కు బాడీగార్డ్‌ను చేసేసిందని కామెంట్లు చేస్తున్నారు.
Finally hearing from @shankarshanmugh daughter about her funny experience with @urstrulyMahesh.
Papam @MeherRamesh ni body guard anukundi 😂😂#MaheshBabu #Khaleja4K #ssmb29 pic.twitter.com/TfzfBLePGo— 👌🌟Ⓜ️🅱️2️⃣9️⃣ (@SPYderLoading) May 31, 2025
చదవండి: కమెడియన్ అలీకి చిరంజీవి గిఫ్ట్.. ఈసారి స్పెషల్‌గా..!