బ్రహ్మాస్త్ర ట్రైలర్‌ ఎఫెక్ట్‌.. ఫుల్‌ టెన్షన్‌లో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ !

Adipurush: Brahmastra Scares For Prabhas Fans - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్ లో రూపొందుతున్న సినిమాల్లో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రా రూ.500  కోట్ల భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈ మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది.

సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాకి హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. అయితే మొన్న బ్రహ్మాస్త్ర ట్రైలర్ చూశాక..బాలీవుడ్ నుంచి వచ్చే సినిమాల వీఎఫ్ ఎక్స్ వర్క్ లపై సినిమా అభిమానులకు నమ్మకం సన్నగిల్లింది.అందులో వీఎఫ్‌ఎక్స్‌(  VFX) చాలా చీప్ గా ఉన్నాయని కామెంట్స్ వచ్చాయి. ఆదిపురుష్ ప్రత్యేకంగా  వీఎఫ్ ఎక్స్‌పై ఆధారపడి చేస్తున్న చిత్రం. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రభాస్ ఇమేజ్ ని దెబ్బకొడుతుంది. చాలా ట్రోలింగ్ ఎదురౌతుంది. మొన్నే రాధేశ్యామ్ లో క్లైమాక్స్ లో వచ్చే గ్రాఫిక్స్ వర్క్ చాలా దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ పడుతున్నారు.

(చదవండి: నేను జీరో.. ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్తా: ఆకాష్ పూరి)

ఇక రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఎపిసోడ్ షూట్ చేశారట. ఈ ఎపిసోడ్ లో  సీత చిన్నప్పటి జీవితాన్ని, రాముడితో పెళ్లి వరకూ సీత జీవితంలో జరిగిన విషయాలని చూపించబోతున్నారట. సీత జీవితం గురించి చెప్పాలంటే ఆమె కుటుంబం గురించి కూడా చూపించాలి కాబట్టి... తండ్రి జనకమహారాజుతో సీతకి ఉండే అనుబంధాన్ని తెరపై చూపించడానికి ఓం రౌత్ రెడీ అయ్యాడు.  ఇక జనకమహారాజు పాత్ర ప్లే చేయాల్సిన ఆర్టిస్ట్ కోసం ఓం రౌత్ చాలా సెర్చ్ చేయగా అందరికన్నా కృష్ణంరాజు అయితేనే పర్ఫెక్ట్‌గా ఉంటాడని ఫిక్స్ అయ్యాడట. మిథిలాధిపతి జనకుడిగా రెబల్ స్టార్ కనిపించబోతున్నాడు.అయితే గతంలో ప్రభాస్,కృష్ణంరాజు కలిసి నటంచిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ సెంటిమెంట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి ఈ రెండు సెంటిమెంట్స్ ని బ్రేక్ చేసి అదుపురుష్ ఆశించిన విజయం సాధిస్తుందా? లేదా? అనేది త్వరలో తెలుస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top