
రాబిన్‌హుడ్(Robinhood) సినిమాను బాగా జనాల్లోకి తీసుకెళ్లిన పాట ‘అదిదా సర్‌ప్రైజ్’. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాట ఎంత సూపర్ హిట్ అయిందో దానికంటే ఎక్కువగా కేతికా శర్మ వేసిన స్టేప్పులు కాంట్రవర్సీని క్రియేట్ చేశాయి. ఒక మహిళలతో అలాంటి హుక్ స్టెప్పులు ఎలా వేయిస్తారంటూ నెటిజన్స్ చిత్ర యూనిట్‌పై మండిపడ్డారు. మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ అంశంపై సీరియస్‌గా స్పందించి, సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్‌లకు హెచ్చరికలు జారీ చేసింది. హీరో నితిన్, హీరోయిన్ శ్రీలీల కూడా ఈ స్టెప్పులపై స్పందించారు.
(చదవండి: ‘రాబిన్‌హుడ్’ హిట్టా? ఫట్టా?)
అయితే వీరిద్దరు కూడా అది పెద్ద తప్పేమి కాదులే అన్నట్లుగా మాట్లాడారు. మరోవైపు కొంతమంది నెటిజన్స్ మాత్రం ఈ స్టెప్పులను బాగా ఎంజాయ్ చేశారు. అలాంటి క్యాస్టూమ్‌నే ధరించి రీల్స్ చేశారు. ఇలా మొత్తంగా అదిదా సర్‌ప్రైజ్ ‘రాబిన్‌హుడ్’కి కావాల్సినంత ప్రమోషన్ చేసిపెట్టింది. మేకర్స్ కూడా ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. వాళ్లు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మల్లెపూల కాస్ట్యూమ్ గురించి, ఆ స్టెప్పుల గురించి మాట్లాడుతూ..వివాదాన్ని ప్రమోషన్స్‌కి వాడుకునే ప్రయత్నం చేశారు. కానీ మహిళా కమిషన్ బహిరంగ లేఖ రాయడంతో వాళ్లు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
రిలీజ్ తర్వాత మళ్లీ కాంట్రవర్సీ జరగకుండా పాటలోని ఆ హుక్ స్టెప్‌ని తీసేశారు. ఈ స్టెప్పులను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు కానీ.. సినిమాలో మాత్రం ఆ హుక్‌స్టెప్ కనిపించకుండా మ్యానేజ్ చేసి ప్రేక్షకులను ‘సర్‌ప్రైజ్’ చేశారు. చిత్రం బృందం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమే. ఈ సినిమా కంటే ముందు బాలయ్య ‘డాకు మహారాజ్’ మూవీపై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి.
ఆ సినిమాలోని ‘దబిడిదిబిడి’ పాట స్టెప్పులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్యను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అయినా కూడా మేకర్స్ అవేవి పట్టించుకోకుండా.. సినిమాలో ఆ స్టెప్పులను అలానే ఉంచేశారు. రాబిన్‌హుడ్ టీం మాత్రం కాంట్రవర్సీకి దారి తీసిన స్టెప్పులను తొలగించి.. తమ సినిమాపై ఎలాంటి వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.