విజయ్‌ ఆంటోనికి జోడీగా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. | Actress Preethi Asrani Will Get Chance To Act With Vijay Antony | Sakshi
Sakshi News home page

విజయ్‌ ఆంటోనికి జంటగా ప్రీతి అస్రాని

Apr 25 2026 6:42 AM | Updated on Apr 25 2026 8:38 AM

Actress Preethi Asrani Will Get Chance To Act With Vijay Antony

వైవిధ్య కథా పాత్రలతో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని. ఈయన తాజాగా శశి దర్శకత్వంలో నటించిన నూరుసామి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. విజయ్‌ అంటోని తన నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ఎం.మారన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు ఇరవుక్కు అయిదు కంగళ్, కన్నై నంబాతే (కళ్లను నమ్మొద్దు), బ్లాక్‌ మెయిల్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను తెరకెక్కించారన్నది గమనార్హం. 

జీవీ ప్రకాష్‌ కుమార్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను పొందింది. తాజాగా  సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని హీరోగా మరో చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి అప్పాకుట్టి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో విజయ్‌ ఆంటోనికి జంటగా ప్రీతి అస్రాని నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. 

తెలుగులో మంచు మనోజ్‌ నటించిన ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? చిత్రంతో ప్రీతి అస్రాని చైల్డ్ ఆర్టిస్‌గా వెండితెరకు పరిచయం అయింది.   'మళ్లీ రావా', గుండెల్లో గోదారి, దొంగలున్నారు జాగ్రత్త, సీటీమార్, తదితర సినిమాల్లో నటించిన   ప్రీతి ఆస్రానీ  హీరోయిన్‌గా ఇప్పటికే తమిళంలో 'కిస్' మూవీతో వచ్చింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement