Actress and MP Sumalatha Son Abhishek Grand Engagement Pics Viral - Sakshi
Sakshi News home page

ఘనంగా నటి సుమలత కొడుకు నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్‌

Dec 12 2022 6:54 PM | Updated on Dec 12 2022 9:10 PM

Actress MP Sumalatha Son Abhishek Grand Engagement Pics viral - Sakshi

సీనియర్‌ నటి, లోక్‌సభ ఎంపీ సుమలత తనయుడు అభిషేక్‌ అంబరీష్‌ నిశ్చితార్థం బెంగళూరులో ఓ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రసాద్‌ బిద్దప్ప కుమార్తె అవివాతో  నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో అభి–అవివా ఉంగరాలు మార్చుకున్నారు.

ఈ వేడుకకు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు  ప్రముఖులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అంబరీష్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రాకింగ్ స్టార్ యష్, తన భార్య రాధికతో కలిసి వచ్చారు. 

సుమలత మాండ్యా నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు కూడా అభిషేక్ – అవివా నిశ్చితార్థానికి వచ్చి వారిని ఆశీర్వదించారు. కాగా అభిషేక్‌, అవివాల మధ్య గత నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా సుమలత కన్నడ నటుడు, రాజకీయవేత్త అంబరీష్‌ను డిసెంబర్ 8న 1991 వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒకే కుమారుడు అభిషేక్ గౌడ. 2018 నవంబర్‌లో అంబరీష్‌ గుండెపోటుతో మరణించారు. ఇటీవల వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దివంగత భర్త అంబరీష్‌ను తలుచుకుంటూ సుమలత ఓ ఎమోహనల్‌ నోట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.


భర్త అంబరీష్‌తో సుమలత(ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement