వేల కోట్లు ఆస్తులు.. కానీ అందులోనే: లయ | Actress Laya Open About Her Family In America | Sakshi
Sakshi News home page

Laya: నా కూతురిని చూస్తే సిస్టర్‌ అనుకుంటారు: లయ

Published Mon, Feb 27 2023 9:34 PM | Last Updated on Mon, Feb 27 2023 10:13 PM

Actress Laya Open About Her Family In America - Sakshi

స్వయంవరం(1999) చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది లయ. తొలి సినిమాతోనే నంది అవార్డు గెలుచుకుంది. మనోహరం, ప్రేమించు సినిమాలకు సైతం వరుసగా నంది అవార్డులు అందుకుంది. దాదాపు 13 ఏళ్ల పాటు సినీరంగంలో స్టార్‌గా నటిగా పలువురు హీరోలతో నటించింది సీనియర్‌ నటించింది ఆమె. సోషల్‌ మీడియాలో ఫోటోలు, వీడియోలతో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భర్త, పిల్లల గురించి చెప్పుకొచ్చారు. 

లయ మాట్లాడుతూ.. 'నా భర్త పేరు శ్రీ గణేశ్ గోర్తి. అమెరికాలో ఫేమస్ డాక్టర్. మాది అరెంజ్‌డ్ మ్యారేజ్. సినిమాల్లో నటించవద్దని ఆయన ఎప్పుడూ నాకు చెప్పలేదు. ఆయన తనకు అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటారు. వైద్యవృత్తిలో ఎప్పుడు బిజీగా ఉంటారు. ఒక్కరే అన్ని చూసుకోగలరు. అమెరికాలోనే నేను కూడా ఐటీలో పనిచేశా. 2017 నుంచి బ్రేక్ తీసుకున్నా. ఇవన్నీ సంతోషం అనుకుంటా కానీ.. చిన్న చిన్న విషయాలే హ్యాపీగా అనిపిస్తాయి. డ్రాయింగ్ వేసినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు. ‍అమ్మాయి ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. మేమిద్దరం కనిపిస్తే చూస్తే మీ సిస్టరా అని అడుగుతారు. బాబుకు 12 ఏళ్లు. నా కూతురు ఒక సినిమాలో చేస్తే బాగుంటుందనిపిస్తుంది. చైల్ట్ ఆర్టిస్ట్‌గా అమర్- అక్బర్- ఆంటోనీలో చేసింది. కానీ నేనెపుడూ ఎవరినీ అడగలేదు. నేనైతే ఇండస్ట్రీలో వెళ్లమని బలవంతం చేయను. నా పిల్లలిద్దరూ తెలుగు కూడా బాగా మాట్లాడతారు. ఇంగ్లీషులో మాట్లాడటం వచ్చాక తెలుగు మరిచిపోయారు. ' అని అన్నారు.

పెళ్లి విషయంపై లయ మాట్లాడుతూ.. 'నేను 2005లో లాస్ ఎంజిల్స్ వెళ్లినప్పుడు మా మదర్ వాళ్ల కజిన్ ఉన్నారు. అక్కడ ఆంటీ పెళ్లి విషయం అడిగారు. మంచి మ్యాచ్ దొరికితే చేసుకుంటా అని చెప్పా. అప్పుడు ఆంటీ నిజంగానే వారికి చెప్పింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చా. నాలుగు నెలల తర్వాత మళ్లీ ఫోన్ చేశారు. అప్పుడే ఫోన్ నంబర్స్ తీసుకుని మాట్లాడుకున్నాం. అలా మా పెళ్లి కుదిరింది.' అంటూ చెప్పుకొచ్చింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement