Andrea Jeremiah: మధ్య తరగతి కుటుంబం.. అయినా అడిగినవన్నీ ఇచ్చారు

Actress Andrea Jeremaiah Intresting Comments About Her Childwood - Sakshi

ఎలాంటి ఛాలెంజింగ్‌ రోల్స్‌లో అయినా నటించే సత్తాగల నటి ఆండ్రియా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన పిశాచి–2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. అదేవిధంగా ఈమె సొంతంగా ఆంగ్లంలో ఫ్లవర్స్‌ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌ను రూపొందించారు. దీన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్‌ విషయాలు షేర్‌ చేసుకుంది. తన తాత రైల్వే శాఖలో ఉద్యోగం చేసేవారని చెప్పిన ఆండ్రియా తమ కుటుంబంలో తొలి పట్టభద్రుడు తన తండ్రి అని, ఆయన న్యాయవాది అని తెలిపారు.

అద్దె ఇల్లు, మోటార్‌ బైక్‌ ఇలా మధ్య తరగతి కుటుంబంతో తమ జీవితం ప్రారంభమైందని చెప్పారు. ఆ తర్వాత సొంత అపార్ట్‌మెంట్, కారు అంటూ నెమ్మదిగా ఎదిగామని చెప్పారు. మొదట్లో నాన్న తనుకు అడిగినవన్నీ కొనిచ్చారని చెప్పింది. అయితే పియానో కొనడం ఆడంబరంగా అనిపించిందన్నారు. తనకు సంగీతం అంటే చాలా ఇష్టం అని దాంతో పియానో నేర్చుకున్నాని చెప్పారు. తనకు 18 ఏళ్లు వచ్చిన తర్వాతే నాన్న పియానో కొనిచ్చారని చెప్పారు.

అయితే అప్పటికే నటనపై దృష్టి సారించటంతో పియానో ఆశ కొంత వరకు తగ్గిందన్నారు. అయితే ఇప్పటికీ తన పియానో భద్రంగా తన షోకేష్‌లో ఉందని పేర్కొన్నారు. కాగా తాను రూపొందించిన సంగీత ఆల్బమ్‌ను విడుదల చేయడానికి కారణం సంగీతానికి సంబంధించినది మాత్రమే కాకుండా పేద పిల్లల చదువు కోసం అని తెలిపారు. తాము సోఫియా ట్రస్ట్‌ పేరుతో స్వచ్ఛంద సేవ సంస్థను ఏర్పాటు చేశామన్నారు. తద్వారా అనాథ పిల్లల విద్యకు సాయం చేస్తున్నామని చెప్పారు. పేదరికం, ఆకలి లేని భారతదేశం అవతరించాలంటే విద్య ఒక్కటే మార్గమని తాను గట్టిగా విశ్వసిస్తానని ఆండ్రియా చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top