
కోలీవుడ్ ప్రముఖ కథానాయకుల్లో శింబు ఒకరిని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయనకు సంచలన నటుడు అనే ముద్ర కూడా ఉంది. శింబు జయాపజయాలకు అతీతుడనే చెప్పాలి. ఇటీవల ఆయన నటించిన మానాడు, వెందు తనిందదు కాడు చిత్రాలు విజయాన్ని సాధించాయి. ఆ తరువాత నటించిన పత్తుతల నిరాశ పరచింది. తాజాగా తన 48వ చిత్రాన్ని కమలహాసన్ సొంత సంస్థ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌లో నటించనున్నారు.
(ఇదీ చదవండి: Salaar Release Date: ప్రభాస్ సలార్ విడుదలపై అఫిషీయల్ ప్రకటన వచ్చేసింది)
దీనికి కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ చిత్రం ఫేమ్ డేసింగు పెరియసామి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం కోసం శింబు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. కాగా 40 ఏళ్ల నటుడు శింబు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే విషయం తెలిసిందే. తన పెళ్లి గురించి మీడియా ఎప్పుడు అడిగినా బదులు దాటేస్తూ వస్తున్నారు.
ఆయన తండ్రి, దర్శకుడు, నటుడు టి.రాజేంద్రన్ సమయం వచ్చినప్పుడు తన కొడుకు పెళ్లి అవుతుందని చెబుతున్నారు. తాజాగా మరోసారి శింబు పెళ్లి గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. శింబుకు కల్యాణ గడియలు ఆసన్నమయ్యాయని, ఒక సినీ ఫైనాన్సియర్ కూతురుతో శింబు ఏడడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. అయితే దీని గురించి శింబు తరఫు నుంచి ఎలాంటి స్పందన లేదన్నది గమనార్హం.