Aamir Khan's Daughter Ira Khan Confirms Relationship With Fitness Trainer Nupur Shikhare - Sakshi
Sakshi News home page

పీకల్లోతు ప్రేమలో ఇరా ఖాన్‌

Feb 12 2021 4:52 PM | Updated on Feb 12 2021 5:44 PM

Aamir Khans Daughter Ira Khan Confirms Relationship With Nupur - Sakshi

ముంబై : బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ కూతురు ఇరా ఖాన్ లవ్‌ ఎఫైర్‌తో గత కొంతకాలంగా తరుచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన తండ్రి ఆమిర్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌ నుపూర్‌ షిఖరేతో ఇరా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. తాజాగా ప్రామిస్‌డే సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌ నుపూర్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ మై వాలెంటైన్‌ అని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అఫీషియల్‌గా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఇరాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  ఇరా పోస్ట్‌పై పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సైతం ఎమోజీల రూపంలో ఆమెకు విషెస్‌ చెబుతున్నారు. ఇక గతేడాది దీపావళి సందర్భంగా మొదటిసారి తన ప్రియుడిని ఫ్యాన్స్‌కు పరిచయం చేసిన ఇరా..కొన్నాళ్లు ఆమిర్‌ ఫాంహౌజ్‌లోనే ఉన్నారని, ఈ క్రమంలో అక్కడే పలు పండుగలను కూడా సెలబ్రెట్‌ చేసుకున్నట్లు సమాచారం. (నాలుగేళ్లు డిప్రెష‌న్‌లో ఉన్నా: ఇరా ఖాన్‌)

గతంలో ఇరా మిషాల్‌ అనే వ్యక్తితో ఇరా ఖాన్‌ ప్రేమాయాణం నడిపిన విషయం తెలిసిందే. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న ఇరా, మిషాల్‌లు 2019లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. కాగా నూపూర్‌ షిఖరే గత కొన్నేళ్లుగా ఆమిర్‌కు పర్సనల్‌‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌లో ఇరా ఫిట్‌నెస్‌పై‌ శ్రద్ద పెట్టడంతో నుపూర్‌ ఆమెకు కూడా కోచ్‌గా మారాడు.ఈ క్రమంలో నుపూర్‌ వ్యక్తిత్వం నచ్చడంతో ఇరా అతడితో ప్రేమలో పడినట్లు సమాచారం. గతేడాది అక్టోబర్‌లో ఇరా తన బాయ్‌ఫ్రెండ్‌ నుపూర్‌ పచ్చబొట్టును వేయించుకుంది. మొదటిసారి టాటూ వేయించుకున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. (లైంగిక వేధింపులకు గురైనా.. : హీరో కుమార్తె)

Advertisement
 
Advertisement
Advertisement