
'3 రోజెస్' సీజన్ 2 (3 Roses Season 2) డైలాగ్స్ సోషల్‌మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి. ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, ‘సత్యం’ రాజేశ్, కుషిత కల్లపు ప్రధానపాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘త్రీ రోజెస్’ నుంచి తాజాగా కమెడియన్ సత్యను పరిచయం చేస్తూ ఒక టీజర్‌ను విడుదల చేశారు. బెట్టింగ్ భోగి పాత్రలో కడుపుబ్బా ఆయన నవ్వించేలా ఉంది. ఐపీఎల్‌లో బెట్టింగ్‌పై పంచ్‌లు వేస్తూ ఆయన నవ్వించారు.
ఆహా (Aha) వేదికగా త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. రవి నంబూరి, సందీప్ బొల్ల ఈ మూవీకి రచన చేయగా, కిరణ్ కె.కరవల్ల దర్శకత్వం వహించారు. నిర్మాతగా ఎస్‌కేఎన్ తెరకెక్కిస్తున్నారు. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఈషా రెబ్బా, కుషిత కల్లపు గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చింది. రాశీ సింగ్ క్యారెక్టర్ గ్లింప్స్‌కి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు.