ఏం జరుగుతుందో ఊహించలేరు  | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతుందో ఊహించలేరు 

Published Mon, Jan 22 2024 2:55 AM

105 Minutes Releasing On January 26 - Sakshi

‘‘పాటలు, ఫైట్స్, కామెడీ... ఇవేం లేకుండా ఓ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘105 మినిట్స్‌’. స్క్రీన్‌ప్లేను బేస్‌ చేసుకుని తీసిన ఈ చిత్రం ఆడియన్స్‌ను మెప్పిస్తుంది’’ అన్నారు దర్శకుడు రాజు దుస్సా. హన్సిక లీడ్‌ రోల్‌లో రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్‌ శివ నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం ‘105 మినిట్స్‌’. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం విలేకర్ల సమావేశంలో రాజు దుస్సా మాట్లాడుతూ– ‘‘ముందు బాలీవుడ్‌లో రైటర్‌గా చేశాను.

సొంతంగా కథలు రాసుకుని, దర్శకత్వ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ‘105’ మినిట్స్‌ సినిమాకు దర్శకత్వం వహించే చాన్స్‌ వచ్చింది. సింగిల్‌ క్యారెక్టర్‌ ఫిల్మ్‌ ఇది. ఓ నీడ మాత్రం కనిపిస్తుంది. కనిపించని మనిషి ఒకరు పంచభూతాలను కంట్రోల్‌ చేస్తూ, ఓ అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా థీమ్‌. సాధారణంగా కొన్ని సినిమాల్లో నెక్ట్స్‌ ఏం జరుగుతుంది? అని ప్రేక్షకులు ఊహిస్తుంటారు. చాలెంజ్‌ చేసి చెబుతున్నాను.. మా సినిమాలో నెక్ట్స్‌ ఏం జరుగుతుందో కూడా ఊహించలేరు’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement