పెద్ది పవర్‌ఫుల్‌ గ్లింప్స్ వచ్చేసింది | Peddi movie Glimpse out now | Sakshi
Sakshi News home page

పెద్ది పవర్‌ఫుల్‌ గ్లింప్స్ వచ్చేసింది

Mar 27 2026 10:35 AM | Updated on Mar 27 2026 12:35 PM

Peddi movie Glimpse out now

రామ్‌ చరణ్‌- బుచ్చిబాబు కాంబినేషన్‌ సినిమా ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చారు. నేడు చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్‌ అభిమానులను మెప్పించాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్‌ మరింత పవర్‌ఫుల్‌గా ఉండటంతో మూవీపై భారీ అంచనాలు పెరిగాయి.

పెద్ది షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక భారీ యాక్షన్‌ సీన్‌లో భాగంగా చరణ్‌ కంటికి గాయమైంది. కొన్ని రోజుల విశ్రాంతి అవసరం ఉన్నప్పటికీ చరణ్‌ మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. ఇందులో చర్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తుంది. 

కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్, జగపతిబాబు, బోమన్‌ ఇరానీ వంటి స్టార్స్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ (AR Rahman) సంగీతం సమకూరుస్తున్నారు. ఏప్రిల్‌ 30న పాన్‌ ఇండియా భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement