రామాయంపేట(మెదక్): మెదక్, సిద్దిపేట చౌరాస్తాల వద్ద జంక్షన్ల విస్తరణకు ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. ఈ రెండు జంక్షన్ల వద్ద గతంలో జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ రోడ్డు ఇరుకుగా మారి పెద్ద వాహనాల టర్నింగ్ కష్టతరమవుతుంది. తరచూ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. సిద్దిపేట రోడ్డు వద్ద రోడ్డు మరీ ఇరుకుగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రెండు జంక్షన్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 30 లక్షల చొప్పున మొత్తం రూ. 60 లక్షలు మంజూరు చేసింది. ఈనిధులతో కూడళ్లు విస్తరించనున్నారు. మెదక్ రూట్‌లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఈనిధులతో జంక్షన్ల విస్తరణతో పాటు ఫౌంటేన్, మొక్కల పెంపకం, రేయిలింగ్, లైటింగ్, దిమ్మ, ల్యాడర్, ఇతరత్ర పనులు జరగనున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే రెండు జంక్షన్ల వద్ద ఇరువైపులా వంద ఫీట్ల మేర రహదారిని విస్తరించనున్నారు. దీంతో ప్రమాదాలు పూర్తిగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
విస్తరణకు నిధుల మంజూరు


