మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక
మెదక్ కలెక్టరేట్: రెండు రోజుల్లో రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక హామీ ఇచ్చారు. పట్టణంలోని సాయిదత్తా థియేటర్ వద్ద గత రెండు నెలలుగా రోడ్డు నిర్మాణ పనులు సాగుతుండటంతో సాయినగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆదివారం స్థానిక కౌన్సిలర్‌తో పాటు మాజీ కౌన్సిలర్ సమీ యొద్దీన్, స్థానిక ప్రజలు సమస్యను చైర్‌పర్సన్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె పరిశీలించారు. వెంటనే ఆర్‌అండ్‌బీ అధికారులతో ఫోన్ ద్వారా మా ట్లాడి వెంటనే రోడ్డు సమస్య పరిష్కరించాలన్నారు. అలాగే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు దృష్టికి తీసుకెళ్లి సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట కాంగ్రెస్ నాయకుడు భూపతిరాజ్ తదితరులు ఉన్నారు.


