మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని వీధి వ్యాపారు లు అభివృద్ధి చెందాలని మెప్మా పీడీ హన్మంతరెడ్డి సూచించారు. గురువారం పట్టణంలో వీధి విక్రయదారుల స్వానిధి మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంకుల వారీగా పెండింగ్ రుణాలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వం వీధి విక్రయదారులను గుర్తించడంతో పాటు వారి అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తుందని తెలిపారు. ఉత్తమంగా వ్యాపారం చేసే వారిని గుర్తించి సన్మానిస్తామన్నారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, ఫుడ్ సేప్టీ అధికారి స్వాదీప్, ఎల్‌డీఎం బాపూజీ, మున్సిపల్ కమిషనర్ నవీన్, బ్యాంకు అధికారులు తదతరులు పాల్గొన్నారు.
చిలప్‌చెడ్(నర్సాపూర్): రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి, సేంద్రియ సాగు చేయాలని కేవీకే హెడ్‌అండ్ సైంటిస్ట్ డాక్టర్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ అన్నారు. గురువారం మండలంలోని బండపోత్‌గల్‌లో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువులతో భూమి ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించి పచ్చి రొట్ట, జీవన ఎరువులతో సాగు చేయాలన్నారు. వరి కొయ్యలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నాలని సూచించారు. సూక్ష్మ పోషకాలు సమపాలల్లో వాడుతూ భూమి ఆరోగ్యాన్ని కాపాడి అధిక దిగుబడులు పొందాలన్నారు. యూరియా వినియోగం తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ వాడాలని చెప్పారు. ఆయన వెంట కేవీకే శాస్త్రవేత్త ప్రతాప్‌రెడ్డి, ఏఓ రాజశేఖర్‌గౌడ్, నాయకులు ప్రవీణ్‌రెడ్డి రైతులు తదితరులు ఉన్నారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం పార్ట్ టైం ఉపాధ్యాయుల నియమించనున్నట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని మెదక్, తూప్రా న్, రామాయంపేట, కొల్చారం మండల కేంద్రాల్లోని గురుకుల పాఠశాలలు, జూనియర్, మెదక్ డిగ్రీ కళాశాలలో మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 4వ తేదీ వరకు తమ ఒరి జినల్, జిరాక్స్ పత్రాలతో దరఖాస్తులు సమర్పించాలన్నారు. జూలై 6న ఉదయం 10 గంటలకు మెదక్‌లోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ బాలికల కళాశాలలో డెమో, ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు. పూర్తి సమాచారం కోసం జిల్లా సమన్వయకర్త అనురాధ (9059526124)ను సంప్రదించాలని సూచించారు.
మెదక్‌జోన్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, ఇందులో భాగంగా పీఆర్సీని ప్రకటించి వెంటనే అమలు చేయాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మెదక్‌లో మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. హెల్త్‌కార్డులకు సంబంధించిన విధివిధానాలు వెంటనే ప్రకటించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వకుండా వారి జీతాల నుంచి 1.5 శాతం తీసుకోవడం సరికాదన్నారు. మోడల్ స్కూల్, కేజీబీవీ, రెసిడెన్షియల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశంలో తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్లం, సిద్దూ, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


