డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొడదాం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొడదాం

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): తాత్కాలిక ఆనందం కో సం డ్రగ్స్‌ బారిన పడి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ‘నషాముక్త్‌ అభియాన్‌– మిషన్‌ పరివర్తన్‌’ కార్యక్రమంలో భాగంగా గురువారం మెదక్‌ మండలం మంభోజిపల్లి గీతా పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొంతమంది యువత డ్రగ్స్‌తో పాటు పలు రకాల వ్యసనాలకు లోనవుతున్నారని అన్నారు. ఈ అలవాట్లు కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాపాయానికి దారితీసే పరిస్థితులు ఉన్నాయన్నారు. అనంతరం డ్రగ్స్‌ వ్యతిరేక అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. డ్రగ్స్‌రహిత సమాజ నిర్మాణానికి మద్దతుగా నిర్వహించిన మానవహారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్‌, డీఈఓ రాజు, మెదక్‌రూరల్‌ సీఐ కృష్ణమూర్తి, గీతా హైస్కూల్‌ కరస్పాండెంట్‌ రామాంజనేయులు, ప్రధానోపాధ్యాయులు మాధవి, ఉపాధ్యాయులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement