మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని విద్యా ఉపాధ్యాయ రంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పద్మారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాలన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టినట్లు తెలిపా రు. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలన్నారు. ఎన్‌ఈపీ– 2020ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఉపాధ్యాయులకు 2023 నుంచి పీఆర్సీ అమలు చేయాలన్నారు. కొత్త పెన్షన్ విదానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరారు. పెండింగ్‌లో 5 డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏఓ యూనస్‌కు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కోశాధికారి అజయ్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యు డు భీమ్లా నాయక్, కార్యదర్శులు నగేశ్, ఏసయ్య, పోచయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు.
టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పద్మారావు


