ఉద్యమకారులకు సముచిత న్యాయం | - | Sakshi
Sakshi News home page

ఉద్యమకారులకు సముచిత న్యాయం

Jun 26 2026 7:39 AM | Updated on Jun 26 2026 7:39 AM

దుబ్బాక: తెలంగాణ ఉద్యమకారులకు సముచిత న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నా రు. గురువారం దుబ్బాక పట్టణంలో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పల్లెల నుంచి పట్నం వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు బైరి రమేశ్‌, ర్యాకం శ్రీరాములు, కాల్వ నరేష్‌, ఆస స్వామి, కాల్వ లింగం తదితరులు ఉన్నారు.

చేనేత పరిశ్రమను కాపాడుకుందాం

దుబ్బాక పట్టణంలోని చేనేత సహకార సంఘాన్ని నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కోదండరాం సందర్శించారు. ఈ సందర్భంగా మగ్గాలను పరిశీలించి కార్మికుల వెతలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకునేలా కృషి చేస్తానన్నారు. దేశంలోనే దుబ్బాక గొల్లభామ చీరలు చాలా ప్రసిద్ధి అని, ఇలాంటి గొప్ప సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే దుబ్బాక పట్టణంలోని 14, 15 వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లోనూ కోదండరాం పాల్గొన్నారు.

చేనేత కార్మికులకు అండగా నిలుస్తాం

ఎమ్మెల్సీ కోదండరాం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement