న్యూస్‌రీల్
వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్న వేళ విత్తన మేళా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సిద్ధమైంది. మంగళవారం నుంచి వారం పాటు జిల్లాలోని 47 రైతు వేదికల్లో కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎల్‌నినో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పంటల మార్పిడితో పాటు 7 రకాల వరి విత్తనాలకు మాత్రమే బోనస్ వస్తోందంటూ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. – మెదక్‌జోన్
విత్తన
మేళాకు
● జిల్లాలోని 47 రైతు వేదికల్లో ఏర్పాట్లు
● అందుబాటులో విత్తనాలు
జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 3.67 లక్షల పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో సింహభాగం వరి మాత్రమే సాగు చేస్తుండగా, ఈ ఏడాది ఎల్‌నినో మప్పు పొంచి ఉంది. ఈనేపథ్యంలో వరికి బదులు, ఆరుతడి పంటలు సాగు చేయాలని, అలాగే సన్నాలకు బోనస్ పొందాలంటే ప్రభుత్వం సూచించిన బీపీటీ– 5204, ఆర్‌ఎన్‌ఆర్–15048, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరాం, కేఎన్‌ఎం–1638, డబ్ల్యూజీఎల్–44, కేఎన్‌ఎం–7715 రకాల విత్తనాలు మాత్రమే సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించనున్నారు. అలాగే నాణ్యమైన విత్తనాలను డీలర్లతో రైతు వేదికల్లో అందుబాటులో ఉంచి విక్రయించేందుకు చర్యలు చేపట్టింది.
7 రకాల సన్నాలకే బోనస్
ఈఏడాది ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జూన్ 1 నుంచి వానాకాలం సీజన్ ప్రారంభం కాగా, గడిచిన 23 రోజుల్లో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 81.0 మి.మీ వర్షం పడాల్సి ఉంది. అయితే కేవలం 51.7 మి.మీ మాత్రమే నమోదైంది. ఈ లెక్కన ఇప్పటివరకు 29.3 మి.మీ లోటు వర్షపాతం నమోదు అయింది. ఈనేపథ్యంలో వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలైన పప్పు దినుసులు, నూనె గింజలు, పలు రకాల కూరగాయలు సాగు చేయాలని, అందుకు సంబంధించిన విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచనున్నారు. అయితే ఇప్పటికే 40 శాతం మంది రైతులు బోరుబావుల ఆధారంగా తుకాలు పోశారు. ప్రస్తుతం 7 రకాల సన్నాలకు మాత్రమే బోనస్ వస్తోందని అధికారులు చెబుతుండటతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తుకాలు పోయకముందు చెప్పాల్సిందని వాపోతున్నారు.
నేటి నుంచి రైతులకు అవగాహన
ఏర్పాట్లు పూర్తి చేశాం
జిల్లాలోని 47 రైతు వేదికల్లో నేటి నుంచి జరిగే విత్తన మేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. వరికి బదులు ఆరుతడి పంటలు, 7 రకాల సన్నాలకు బోనస్ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తాం.
– దేవ్‌కుమార్, డీఏఓ


