సత్వరమే పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

సత్వరమే పరిష్కరించండి

Jun 23 2026 7:49 AM | Updated on Jun 23 2026 7:49 AM

దరఖాస్తుల ఆహ్వానం

మెదక్‌జోన్‌: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు లను జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి వినతిపత్రాలు అందజేశారు. ఈ విషయంపై ఎస్పీ నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులతో మా ట్లాడారు. ప్రజావాణి ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపాలంటూ ఆదేశించారు.

చిరుధాన్యాల సాగు మేలు

నర్సాపూర్‌ రూరల్‌: చిరు ధాన్యాలు సాగు చేసి మంచి లాభాలు సాధించాలని తునికి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ నల్క ర్‌ రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని అహ్మద్‌నగర్‌లో తునికి కృషి విజ్ఞాన కేంద్రం, ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా శాస్త్రవేత్తలు డాక్టర్‌ నల్కర్‌, డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ హరిప్రసన్న మాట్లాడుతూ రసాయన వాడకంతో ఇప్పటికే భూములు భూసారం కోల్పోయాయని తెలిపారు. భూమిలో సేంద్రియ కార్బన్‌ పెంపొందించడం కోసం చేపట్టాల్సిన పద్దతులను రైతులకు వివరించారు. పంటలు సాగు చేసే ముందు మట్టి నమూనా సేకరణ, భూసార పరీక్షలు తప్పనిసరిని సూచించారు. జీవన ఎరువుల వాడకంపై వివ రించారు. కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల విద్యార్థులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

కార్మికులను

పర్మినెంట్‌ చేయాలి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని మున్సిపల్‌ ఉద్యోగులు, కార్మికులకు పీఆర్సీలో నిర్ణయించిన కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం కార్మికులతో కలిసి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీఓ 60 ప్రకటించినప్పటికీ జీఓలో పేర్కొన్న కేటగిరీల వారీ వేతనాలను మున్సిపల్‌ కార్మికులకు చెల్లించక పోవడం అన్యాయం అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. అలాగే మున్సిపల్‌ కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్‌లో అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోశ్‌, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు.

నాణ్యతలో రాజీ పడొద్దు

కౌడిపల్లి(నర్సాపూర్‌): సీసీ రోడ్డు పనుల నాణ్య తలో రాజీ పడొద్దని పీఆర్‌ డిప్యూటీ ఈఈ అమరేశ్వర్‌ అన్నారు. సోమవారం ఉపాధి హా మీ పథకంలో భాగంగా సీసీ రోడ్డుకు రూ. 14 లక్షలు మంజూరు కాగా, కౌడిపల్లి రామాల యం కాలనీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు. గ్రామా భివృద్ధిలో రోడ్లు ఎంతో ముఖ్యమని, పనుల్లో రాజీ పడొద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చంద్రం కృష్ణాగౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ జస్టిస్‌లో మూడేళ్లు శిక్షణ పొందేందుకు లా పట్టభద్రులైనా ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి హమీద్‌ సోమవారం తెలిపారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement