మెదక్ కలెక్టరేట్: జిల్లాలో అర్హులైన పౌరులందరూ ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు అందరూ సహకరించాలన్నారు. ఈనెల 25 నుంచి జూలై 24 వరకు ‘సర్’ కార్యక్రమం జరుగుతుందన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్ కేంద్రానికి ఒక బూత్ ప్రతినిధిని నియమించి వివరాలు అందించాలన్నారు. ఓటర్లు తమ వివరాలను అన్‌లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. సందేహాలుంటే టోల్ ఫ్రీ 9553866388 నంబర్‌కు కాల్ చేయాలన్నారు. జూలై 31, 2026న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేయ నున్నట్లు చెప్పారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


