సాగు చేసిన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలి. నాకు 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా రెండు పంటలు పండిస్తాను. గత యాసంగిలో కేవలం 2 ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సాయం ఇచ్చారు. అది కూడా కోతల సమయంలో అందజేశారు. ఈసీజన్‌లోనైనా పూర్తిస్థాయిలో అందజేయాలి.
– భూపాల్‌రెడ్డి, రైతు, మెదక్
ఎలాంటి సమాచారం లేదు
వానాకాలం సీజన్‌కు సంబంధించి ఈనెల 30న రైతు భరోసా నిధులు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ముందుగా ఎకరం వరకు వేస్తామని సీఎం ప్రకటించిన విషయం పత్రికల్లో మాత్రమే చూశాం. అధికారికంగా మాకు ఎలాంటి సమాచారం అందలేదు.
– దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి


