రామాయంపేట(మెదక్): బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షు రాలిగా మల్లిక నియామకం అయ్యారు. ఈ మేరకు ఆదివారం పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ రఘునందన్‌రావు ఆమెను సన్మానించారు. తన నియామకానికి సహకరించిన వారికి మల్లిక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతంతో పాటు మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఆలయాలు
ప్రశాంతతకు నిలయాలు
వెల్దుర్తి(తూప్రాన్): ఆలయాలు మానసిక ప్ర శాంతతకు నిలయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మన్నెవార్ జలాల్‌పూర్ కాళీమాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా నాయకులతో కలిసి ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆలయాల పునరుద్ధరణకు కృషి చేయడం ఎంతో శుభ సూచకమని అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
మహిళలకు చేయూత
చిన్నశంకరంపేట(మెదక్): మహిళలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సొంత భవనాల్లో సమావేశాలు జరుపుకోవచ్చన్నారు. అనంతరం అంబాజిపేటలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం కొర్విపల్లిలో పోచమ్మతల్లికి బోనం సమర్పించారు కార్యక్రమంలో సర్పంచ్‌లు చంద్రశేఖర్, సబితాగౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మోహన్‌నాయక్, రమణ, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మల్లన్న ఆలయంలో
భక్తుల సందడి
‘జయశంకర్ స్ఫూర్తిని
కొనసాగిద్దాం’
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మలి దశ ఉద్యమానికి సిద్ధాంత కర్తగా నిలిచిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రైతు రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు అందె ప్రవీణ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని అందె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి జయశంకర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి సంక్షేమ అవకాశాల కల్పన కోసం అధికార పాలనా యంత్రాంగం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాదగిరి, ఉప సర్పంచ్ పర్శరాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు, నాయకులు రాజ్‌కుమార్, రాజేందర్, పోచయ్య, లక్ష్మీనారాయణ, రాంరెడ్డి, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.


