నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలి

Jun 22 2026 7:09 AM | Updated on Jun 22 2026 7:09 AM

మెదక్‌ కలెక్టరేట్‌: నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించి, ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్లక్ష్యం చేస్తే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. అలాగే మెరుగైన ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు చేసి అందరికీ పాత పెన్షన్‌ విధానం వర్తింపచేయాలన్నారు. మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే జీపీఎఫ్‌ ఖాతాలు తెరిపించి పాత పెన్షన్‌లోకి తీసుకోవాలన్నారు. అదే విధంగా 317 బాధితులందరికీ న్యాయం చేయాలన్నారు. ఇదిలా ఉండగా ఉద్యోగులందరి ఆరోగ్య భద్రతకు హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈసందర్భంగా పలు అంశాలపై తీర్మానాలు చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పద్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

నిర్లక్ష్యం చేస్తే

ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం

టీఎస్‌యూటీఎఫ్‌

రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement