దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Jun 21 2026 7:16 AM | Updated on Jun 21 2026 7:16 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండలంలోని కేజీబీవీలో ఖాళీగా ఉన్న నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్‌ గీత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హెడ్‌ కుక్‌, అసిస్టెంట్‌ కుక్‌, అటెండర్‌, నైట్‌ వాచ్‌మెన్‌, స్వీపర్‌, స్కావెంజర్ల ఎంపిక కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు గల మహిళలు చిన్నశంకరంపేటలో కొనసాగుతున్న కేజీబీవీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

నేడు ‘పేట’లో

కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌

రామాయంపేట(మెదక్‌): పట్టణంలోని ప్రభు త్వ ఆస్పత్రిలో ఆదివారం కేన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ప్రక్రియను మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్‌ శంకర్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.

3,903 కేసుల పరిష్కారం

మెదక్‌జోన్‌: రాజీయే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. శనివా రం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని మెదక్‌, నర్సాపూర్‌, అల్లాదు ర్గం కోర్టుల పరిధిలో 3,903 కేసులు పరిష్కారం అయ్యాయని చెప్పారు. చిన్నపాటి గొడవలతో కోర్టులు, పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగి విలువైన సమయం, డబ్బు వృథా చేసుకోవటం కన్నా ఇరువర్గాల కక్షిదారులు రాజీపడటం ఉత్తమం అన్నారు. కార్యక్రమంలో న్యామూర్తులు సుభవల్లి, సంతోష్‌ కుమార్‌, సౌజన్య, సాయిప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

పన్నుల వసూలు భేష్‌

మెదక్‌ కలెక్టరేట్‌: పన్నుల వసూళ్లలో అధికారులు, సిబ్బంది పనితీరు భేష్‌ అని, మరింత ఉత్సాహంతో పనిచేసి పట్టణాభివృద్ధికి కృషి చేయాలని మెదక్‌ మున్సిపల్‌ కమిషనర్‌ నవీన్‌ అన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 3 నెలల్లోనే ఇప్పటివరకు రూ. 3 లక్షలు ఆస్తి, ఇతర పన్నులు సిబ్బంది వసూలు చేశారు. ఈసందర్భంగా శనివారం వారికి అభినందన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో గతంలో కంటే అధిక మొత్తంలో పన్నులు వసూలు కావడం అభినందనీయ మని అన్నారు. పట్టణ పరిధిలోని ప్రజలంతా సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించా రు. అధికారులు పన్నుల కోసం వచ్చినప్పుడు ప్రజలు సహకరించాలని కోరారు.

అత్యధికంగా ధాన్యం సేకరణ

మెదక్‌ కలెక్టరేట్‌: గతంలో కంటే ఈ ఏడాది జిల్లాలో అత్యధికంగా సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ తెలిపారు. ఇప్పటివరకు 4,18,244 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసి 86,130 మంది రైతుల ఖాతాల్లో రూ.892.62 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. 528 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి కాగా, మరో 5 కేంద్రాల్లో కొంతమేర ధాన్యం మిగిలినట్లు పేర్కొన్నారు.

30 పాఠశాలలకు ట్యాబ్‌లు

మెదక్‌ కలెక్టరేట్‌: దృశ్య మాధ్యమంలో పిల్లలకు బోధన మరింత మెరుగ్గా ఉంటుందని డీఈఓ రాజు అన్నారు. శనివారం మేఘశాల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 30 ప్రభుత్వ పాఠశాలలకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యాంశాలు ఉన్న ట్యాబ్‌లను ఒక్కో పాఠశాలకు రెండు చొప్పున అందజేశారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ట్యాబ్‌ల ద్వారా విద్యార్థుల్లో పఠనాభివృద్ధి పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ సుదర్శనమూర్తి, మేఘశాల సంస్థ ప్రతినిధులు ప్రశాంత్‌, లావణ్య, టీచర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement