మొలకెత్తని విత్తనాలు మొలక కోసం నానబెట్టిన వరి విత్తనాలు సరిగ్గా మొలకెత్తలేదని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు 8లో u | - | Sakshi
Sakshi News home page

మొలకెత్తని విత్తనాలు మొలక కోసం నానబెట్టిన వరి విత్తనాలు సరిగ్గా మొలకెత్తలేదని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు 8లో u

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

మొలకెత్తని విత్తనాలు మొలక కోసం నానబెట్టిన వరి విత్తనాలు సరిగ్గా మొలకెత్తలేదని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాలు 8లో u

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 16 శ్రీ జూన్‌ శ్రీ 2026

మోగిన బడి గంటలు

మెదక్‌జోన్‌: వేసవి సెలవుల తర్వాత బడి గంటలు మోగాయి. సోమవారం పుస్తకాల సంచులు భుజాలకు వేసుకొని సరికొత్త ఉత్సాహంతో విద్యార్థులు బడి బాట పట్టారు. తొలిరోజు ఉపాధ్యాయులు పూలతో స్వాగతం పలికారు. వారందరికీ పుస్తకాలు పంపిణీ చేశారు. సెలవుల్లో వెలవెలబోయిన పాఠశాలలు విద్యార్థుల రాకతో కొత్తకళను సంతరించుకున్నాయి. 2026–27 విద్యా సంవత్సరం అధికారికంగా ప్రారంభం కావడంతో అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ పాఠశాలలో సందడి నెలకొంది. అయితే అమావాస్య కావటంతో తల్లిదండ్రులు పిల్లలను బడులకు పంపలేదు. అలాగే ప్రైవేట్‌ పాఠశాలలు చాలా వరకు తెరుచుకోలేదు. ఫలితంగా మొదటి రోజు 40 శాతం విద్యార్థులు మాత్రమే బడులకు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 900 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 63 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే విద్యార్థుల యూనిఫాంలు ఇంకా అందలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు

తొలిరోజు ‘అమావాస్య’ ఎఫెక్ట్‌

40 శాతం మాత్రమే హాజరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement