నర్సాపూర్: ఎరువుల బ్లాక్ మార్కెట్‌ను అదుపు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు విత్తనాలు, ఎరువులు సరిపడా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని ఆరోపించారు. పలువురు డీలర్లు రసాయన ఎరువుల స్టాక్ లేదని బుకాయిస్తూ వాటిని అధిక ధరలకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని వాపోయారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణ కురవైందని విమర్శించారు. రైతులు యూరియాను యాప్‌లో కొనుగోలు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని వరిగుంతం, కూకుట్లపల్లి, చిన్నచింతకుంట తదితర కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం కొనలేదని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని సైతం తూకం వేసి తీసుకోవాలని ఆమె కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు శేఖర్, నయిమోద్దీన్, విఠల్, మహేందర్‌రెడ్డి, గౌరిశంకర్ తదితరులు ఉన్నారు.
ఎమ్మెల్యే సునీతారెడ్డి


