విత్తన ఎంపికే కీలకం | - | Sakshi
Sakshi News home page

విత్తన ఎంపికే కీలకం

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

ఖరీఫ్‌ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకొని విత్తనాలు వేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే, పంట బాగుండాలన్నా.. అధిక దిగుబడులు రావాలన్నా.. తెగుళ్లు తట్టుకోవాలన్నా విత్తన ఎంపికే కీలకం అంటున్నారు వ్యవసాయ అధికారులు. విత్తనాలు కొనుగోలు సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలనిసూచిస్తున్నారు. – మెదక్‌జోన్‌

జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్‌లో 3.67 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో సింహభాగం 3.16 లక్షల ఎకరాల్లో వరి పండించనున్నారు. రెండో స్థానంలో పత్తి 36 వేల ఎకరాలు, 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలు సాగు కానున్నాయి. మిగితా 12 వేల ఎకరాల్లో కందులు, పెసలు, ఆముదం, కూరగాయల పంటలు సాగు చేయనున్నారు. అయితే ఎప్పటిలాగే ఈసారి సైతం రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతుండగా, ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచింది.

పత్తి విత్తనాలు విత్తుతున్న రైతులు

సరైనవి ఎంపిక చేసుకోండి

ప్రభుత్వం సూచించిన విత్తనాలలో సరైన వాటిని రైతులు ఎంపిక చేసుకోవాలి. నీటి వసతిని బట్టి విత్తనాలు ఎంచుకోవాలి. ముఖ్యంగా సన్నాలకు బోనస్‌ రావాలంటే ప్రభుత్వం చూపించిన వైరెటీలను పండించాలి. – దేవ్‌కుమార్‌, డీఏఓ

పత్తిలో 4 రకాలు

జిల్లాలో వరి సాగు తర్వాత వర్షాధారంగా సాగు చేసే రెండో పంట పత్తి. జిల్లాలో టేక్మాల్‌, పెద్దశంకరంపేట, రేగోడ్‌, అల్లాదుర్గం మండలాల్లోని నల్లరేగడి భూముల్లో పంట పండిస్తారు. పత్తి సాగు కోసం 4 రకాల విత్తనాలు నాణ్యమైనవిగా ప్రభుత్వం గుర్తించింది. క్రిస్టాల్‌, మైకో, రాశి, నూజీవీడు రకాలు ఉన్నా యి. హెర్‌బీసైడ్‌ టాలరెంట్‌ (హెచ్‌టీ) అనే రకం పత్తి విత్తనాన్ని నిషేధించింది.

వరిలో 17 రకాలు

వరిలో 17 రకాల విత్తనాలను అధికారులు నాణ్యమైనవిగా గుర్తించారు. వాటిలో 15 రకాలు సన్నవి కాగా, 2 రకాలు మాత్రమే దొడ్డువి ఉన్నాయి. బోరుబావుల్లో ఉన్న నీటితో పాటు వర్షాలు సకాలంలో కురిసి జూలైలో చెరువుల నిండితే 150 రోజుల్లో చేతికందే పంటలు సాగు చేయవచ్చు. అలాగే అతితక్కువ నీరుంటే 110– 120 రోజుల్లో చేతికందే పంటలు, అదే మధ్యస్తంగా నీరుంటే 120 –135 రోజుల్లో చేతికందే పంటలను ఎంపిక చేసుకోవచ్చు. ఆర్‌ఎన్‌ఆర్‌ (15048) తెలంగాణ సోనా, బీపీటీ 5204 సెగ్మెంట్‌, హెచ్‌ఎంటీ సోనా, జైశ్రీరాం, డబ్ల్యూజీఎల్‌ 44, కేఎన్‌ఎం 1638, డబ్ల్యూజీఎల్‌ 962, జేజీఎల్‌ 1798.. ఈ ఎనిమిది రకాల విత్తనాల్లో మూడు రకాల వైరెటీలు ఉన్నాయి. అలాగే దొడ్డు వరి రకానికి చెందినవి ఎంటీయూ 1010, కేఎన్‌ఎం 118 కూనారం సోనా అనే రకాలు మాత్రమే నాణ్యమైనవిగా గుర్తించారు. రూ. 500 బోనస్‌ రావాలంటే ప్రభుత్వం ప్రతిపాదించిన సన్నాలను మాత్రమే సాగు చేయాల్సి ఉంటుంది.

నాణ్యమైన వాటితోనే

అధిక దిగుబడులు

అప్రమత్తంగా ఉండాలంటున్న

అధికారులు

ఖరీఫ్‌కు సమాయత్తమవుతున్న రైతులు

మొక్కజొన్న

డీహెచ్‌ఎం–206 (తెలంగాణ మొక్కజొన్న)

గంగా కావేరీ హైబ్రీడ్‌, పయనీర్‌ (సిన్‌జెంటా)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement