నస్కల్‌లో ఎకై ్సజ్‌ అధికారుల విచారణ | - | Sakshi
Sakshi News home page

నస్కల్‌లో ఎకై ్సజ్‌ అధికారుల విచారణ

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

రామాయంపేట(మెదక్‌): ‘మద్యం అమ్మకాలకు బహి రంగ వేలం’ శీర్షికన ఈనెల 13న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఎకై ్సజ్‌ అధికారులు స్పందించారు. ఈమేరకు ఎస్‌ఐ విజయ్‌ సిద్దార్థ ఆధ్వర్యంలో పోలీసులు నిజాంపేట మండలం నస్కల్‌ గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. గ్రామంలో మద్యం అమ్మకాల కోసం జరిగిన బహిరంగ వేలంలో పాల్గొన్న పలువురిని విచారించారు. మద్యం అమ్మకాలు కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు గ్రామంలో మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాపుపై దాడులు నిర్వహించి, లిక్కర్‌ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లాగౌడ్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

ఫిర్యాదులు వెంటనే

పరిష్కరించండి

మెదక్‌జోన్‌: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ శ్రీనివాసరావు పోలీస్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున బాధితులు తరలిరాగా, వారి నుంచి ఎస్పీ నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. వారితో నేరుగా మా ట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో వ్యక్తిగత, సామాజిక, భూ వివాదాలు, మోసాలు, వేధింపులు ఇతర సమస్యలకు సంబంధించిన అర్జీలు ఉన్నారు. ఈసందర్భంగా ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఎస్పీ మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.

డంప్‌యార్డ్‌ను తరలించండి

నర్సాపూర్‌ రూరల్‌: డంప్‌యార్డ్‌ను తరలించాలని మండలంలోని పెద్ద చింతకుంట సర్పంచ్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం మున్సిపల్‌ కమిషనర్‌ సాయికుమార్‌తో పాటు ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ దివ్యను వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నర్సాపూర్‌ శివారులో గల సర్వే నంబర్‌ 135లో మున్సిపాలిటీ చెత్తను వేయడంతో పెద్ద చింతకుంటలోని చెరువులు కలుషితం అవుతున్నట్లు తెలిపారు. అలాగే పంచాయతీ పరిధిలోని పాప్యా, సీతారాం గిరిజన తండాల ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి వార్డుకు ప్రాధాన్యం

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రతీ వార్డుకు సమ ప్రాధాన్యం ఇస్తూ రూ.2.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు తెలిపారు. సోమవారం పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. మెదక్‌ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి ఫలాలు ప్రతి వార్డుకు, ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహ దారులు, మురికి కాల్వలు, తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు కీలక పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

నీటి సరఫరాకు అంతరాయం

నర్సాపూర్‌: భగీరథ నీటి సరఫరాకు మంగళవారం నుంచి మూడు రోజులు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. చెక్రియాల్‌ వద్ద పైపులైన్‌కు లీకేజీ ఏర్పడిందని, మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement