18న వన మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

18న వన మహోత్సవం

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ అధికారులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈనెల 18న వన మహోత్సవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వక్చువల్‌గా ప్రారంభిస్తారని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో వన మహోత్సవ లక్ష్యం 31.95 లక్షలుగా నిర్ణయించినట్లు తెలిపారు. అన్నిశాఖల అధికారులు తమ శాఖలకు కేటాయించిన లక్ష్యాలకనుగుణంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వన మహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి పరిరక్షించాలని పిలుపునిచ్చారు. జిల్లాను మరింత పచ్చదనంతో నింపేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అంతకుముందు జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం రాష్ట్రస్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు.

అటవీ భూముల

ఆక్రమణపై ఉక్కుపాదం

శివ్వంపేట(నర్సాపూర్‌): అటవీ భూములను ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అటవీ డిప్యూటీ రేంజ్‌ అధికారి సిద్దిరాంసింగ్‌ హెచ్చరించారు. మండల పరిధిలోని రుప్లతండాలో ఓ రైతు అటవీ భూమి ఆక్రమించి ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశాడు. సదరు రైతుకు సాగు కోసం ఇచ్చిన అటవీ భూమి పొ జిషన్‌ ఒకచోట ఉంటే, అదనంగా మరోచోట మూడెకరాల అటవీ భూమిని చదును చేయడంతో సోమవారం అటవీ శాఖ సిబ్బంది హద్దులను తొలగించారు. అటవీ సెక్షన్‌ అధికారులు కలీమొద్దీన్‌, శ్రీధర్‌కుమార్‌, సాయిరాం, బీట్‌ అధికారులు మౌనిక, శిరీష, వెంకటేశ్‌, గౌస్‌, హరిత, రజని, కుమార్‌, రమ్య తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement