హవేళిఘణాపూర్(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ రాజు అన్నారు. సోమవారం కూచన్‌పల్లి జెడ్పీ హైస్కూ ల్‌లో విద్యార్థులకు నూతన అడ్మిషన్లు ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న విద్య, మౌలిక వసతులను గుర్తించి విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరడం అభినందనీయమన్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు చదువుపై ఆసక్తి చూపించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. దాని ద్వారా విద్యార్థులు భవిష్యత్‌లో బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, మల్లారెడ్డి, సందీప్, కృష్ణ, రాజేందర్, శశికుమార్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, కృష్ణవేణి, గంగమణి, ఎంఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.
డీఈఓ రాజు


