
నిబంధనలు ఇవీ..
● 15 ఏళ్లు నిండిన వాహనాలను రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్‌లోఉండాలి.
● విద్యాసంస్థ పేరు, ఫోన్ నంబర్, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందుభాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి.
● బస్సు నడిపే డ్రైవర్ వయసు 60 ఏళ్లకు మించకూడదు. బీపీ, షుగర్, కంటి జబ్బులు ఉండకూడదు.
● అతడికి పాఠశాల యాజమాన్యం ప్రతి 3 నెలలకోసారి ఆరోగ్య పరీక్షలు చేయించాలి.
● డ్రైవర్‌కు కనీసం 5 సంవత్సరాల అనుభవంతో పాటు సీనియర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
● ఏటా బస్సు ఫిట్‌నెస్ తప్పకుండా చేయించాలి. ఆర్టీఏ అధికారులు బస్సును పూర్తిగా చెక్ చేసి సర్టిఫికెట్ ఇచ్చాకే విద్యార్థులను తరలించాలి.
● ప్రతీ బస్సుల్లో ఒక అటెండర్ తప్పకుండా ఉండాలి. ప్రమాదావశాత్తుమంటలు చెలరేగితే ఆర్పే యంత్రం ఉంచాలి.
● సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తరలించకూడదు.
● రోడ్డు భద్రతపై ఆర్టీఏ, పోలీస్‌శాఖలు ఏడాదికోసారి విద్యార్థులకు అవగాహన కల్పించాలి.