
ఆటపాటల అంగన్‌వాడీ బోధన
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: చిన్నారులకు సులభంగా అర్థమయ్యేలా అంగన్‌వాడీలో ఆటపాటల ద్వారా బోధన అందించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని శాసీ్త్రనగర్ అంగన్‌వాడీ కేంద్రంలో అమ్మమాట –అంగన్‌వాడీ బాట కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా అంగన్‌వాడీ చిన్నారులకు సైతం ఏకరూప దుస్తులు, ప్రతీ బుధవారం ఎగ్ బిర్యాని అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ స్వరూప్ షెట్కార్, మాజీ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఖేడ్ మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సును ఆర్డీఓ అశోకచక్రవర్తితో కలిసి ప్రారంభించారు. గత ప్రభుత్వం వేల ఎకరాల ప్రభుత్వ భూమిని నాయకులకు పట్టాలుగా మార్పిడి చేసిందన్నారు. అలాగే ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఎనిమిది ట్రాక్టర్ల ఉచిత ఇసుకను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ర్యాలమడుగు సబ్‌స్టేషన్‌కు ప్రత్యేక ఫీడర్‌ను ఏర్పాటు చేసి ప్రారంభించారు.