
బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025
ముందు మురిపించిన వానలు పక్షం రోజులుగా ముఖం చాటేశాయి.
మే నెలలో కురిసిన అకాల వర్షాలకు దుక్కులు దున్నిన రైతులు వర్షాధార పంటలను సాగు చేశారు.
తీరా వర్షాకాలం ప్రారంభమయ్యాక విత్తనం విత్తాక చినుకు పడకపోవటంతో అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలో మే నెలలో అకాల వర్షాలు దంచికొట్టాయి. యాసంగి ధాన్యాన్ని అమ్ముకోనివ్వకుండా నిత్యం వర్షంతో ధాన్యం తడిసిముద్దయింది. ఫలితంగా నానా తంటాలు పడి ధాన్యం అమ్ముకున్నారు. వానలకు భూములు తడవటంతో రైతులు దుక్కులు దున్ని వర్షాధార పంటలైన పత్తి, కూరగాయలసాగు, కంది, పెసర లాంటి ఆరుతడి పంటలతో పాటు పచ్చిరొట్ట విత్తనాలను సైతం సాగు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3.50 లక్షల ఎకరాలలో వివిద రకాల పంటలను సాగుచేస్తుండగా ఇందులో అత్యధికంగా వరిసాగు కాగా రెండవ అత్యధికంగా పత్తి పంట సాగు చేస్తున్నార. వరిసాగు 3.5 లక్షల ఎకరాలలో సాగవుతుండగా పత్తి పంట 37 వేల ఎకరాలలో సాగు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. కాగా ఇప్పటివరకు కేవలం 10 వేల ఎకరాలకు పైగా పత్తిసాగు చేసినట్లు సమాచారం. పత్తితోపాటు కూరగాయలు, కందులు, పెసర్లు, పచ్చిరొట్ట విత్తనాల సాగు సైతం మరో వెయ్యి ఎకరాల వరకుసాగైనట్లు సబంధిత అధికారులు చెబుతున్నారు.
నాలుగు మండలాల్లో అత్యధికం..!
జిల్లాలో రేగోడు, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గ్ మండలాల్లో అత్యధికంగా పత్తిసాగు చేస్తారు. ఈ పంటను పూర్తిగా వర్షాధారంగా సాగు చేస్తారు. ఆ మండలాల్లో సాగు నీరు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రతీఏటా వానాకాలంలో పత్తిపంటను సాగు చేస్తారు. కాగా పత్తిసాగు చేశాక కనీసం 10 రోజులకొకసారైనా వర్షం కురిస్తేనే విత్తిన విత్తు మొలకెత్తుతుంది. లేకపోతే ఎండ వేడిమికి విత్తు మొలకెత్తక పోగా భూమిలో విత్తిన విత్తును చెదలతో పాటు ఇతర చీమలు తినేసే అవకాశముంటుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వర్షం వచ్చిన వాతావరణం కనిపించినా ఆ తర్వాత గాలి మొదలై మేఘాలు కాస్తా తేలిపోతున్నాయి. మరో వారం పాటు ఇలాగే వర్షం కురవకుంటే వర్షాధారంగా సాగు చేసిన ఆరు తడి పంటలను మళ్లీ సాగు చేయాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
విన్సెంట్ వినయ్‌కుమార్
న్యూస్‌రీల్
నమోదు ప్రక్రియలో లోపాలను గుర్తించాలి కలెక్టర్ రాహుల్‌రాజ్ యోగా డే పోస్టర్ ఆవిష్కరణ
ముందస్తుగా కురిసిన వర్షాలు
ఇప్పటికే వర్షాధార పంటలను
విత్తుకున్న రైతులు
పక్షం రోజులుగా
ముఖం చాటేసిన వర్షాలు
ఆందోళనలో రైతులు

బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025

బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025

బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2025