
అర్హత లేని వైద్యం!
అదను దాటుతోంది సాగులో అదను దాటితే దిగుబడులపై ప్రభావం చూపుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వివరాలు 8లో u
జొన్నల డబ్బులేవీ..?
జొన్నలు విక్రయించినా ఇంకా డబ్బులు రాలేదని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వివరాలు 9లో u
మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025
రామాయంపేట(మెదక్): వైద్యుడంటే ప్రాణాలు కాపాడే నారాయణుడిగా భావిస్తారు. అందుకే అంతా వైద్యో నారాయణో హరి అంటారు. అలాంటి వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు కొందరు నకిలీలు. ఎలాంటి అర్హత లేకున్నా మిడి మిడి జ్ఞానంతో వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా రామాయంపేటలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. గతంలో కంపౌండర్‌గా పనిచేసిన అనుభవంతో ఓ వ్యక్తి పట్టణం నడిబొడ్డున ఎలాంటి విద్యార్హత లేకున్నా గణపతి క్లినిక్‌ను ప్రారంభించాడు. రోగులు అతడి వద్దకు క్యూ కట్టారు. ఇటీవల ఓ మహిళకు వైద్యం వికటించి ప్రాణాలమీదికొచ్చింది. దీంతో ఆమెను మరో ఆస్పత్రికి తరలించి వైద్య ఖర్చులు భరించి బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేయడంతో క్లినిక్‌ను మూసి పారిపోయాడు. ఇటీవల జిల్లా పరిధిలో 10 మంది నకిలీ వైద్యులకు వైద్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.
అనుమతి లేకుండా ఆస్పత్రుల నిర్వహ ణ
అమాయక ప్రజలే లక్ష్యంగా జిల్లాలో నకిలీ వైద్యులు చలామణి అవుతున్నారు. అర్హత లేకున్నా వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలమీదికి తెస్తున్నారు. అయితే వైద్యం వికటించి రోగి ప్రాణాల మీదకు వస్తే తప్ప నకిలీల బండారం బయటపడటం లేదు. అలాంటి ఆస్పత్రులపై ఫిర్యాదులు వస్తే తప్ప సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. వైద్యశాఖ అనుమతులు లేకుండానే జిల్లాలో కనీసం 30 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు అక్రమంగా కొనసాగుతున్నాయని సమాచారం. రాజకీయ ప్రోద్బలంతో వైద్యశాఖ అధికారులు వీరిపై చర్యలకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.
ఆర్‌ఎంపీల ఇష్టారాజ్యం
జిల్లా పరిధిలో సుమారు 2,500 పైగా ఆర్‌ఎంపీలు గ్రామాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను నడుపుతున్నారు. వారి వద్దకు వస్తున్న రోగులకు వైద్య సలహాలు మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, సైలెన్ పెట్టడం,మందుల చీటి రాయడం వంటివి చేస్తున్నారు. ప్రిస్కిప్షన్ రాయడం చట్టప్రకారం నేరం. అలాగే తమ పేర్లకు ముందు డాక్టర్ అని రాసుకోకూడదు. కానీ కొందరు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నారు.
న్యూస్‌రీల్
ప్రాణాలతో చెలగాటం
పుట్టగొడుగుల్లా.. నకిలీ వైద్యులు జిల్లావ్యాప్తంగా 10 మందికి నోటీసులు
నకిలీలపై కఠిన చర్యలు
ఎలాంటి అర్హత లేకపోయినా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటీవలే జిల్లా పరిధిలో కొందరికి నోటీసులు జారీ చేశాం.నిబంధనల మేరకు ఆర్‌ఎంపీలు సైలెన్ పెట్టొద్దు. మందులకు సంబంధించి ప్రిస్కిప్షన్ రాయొద్దు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం నకిలీలపై చర్యలు తీసుకుంటాం.
– శ్రీరాం, డీఎంహెచ్‌ఓ

అర్హత లేని వైద్యం!

అర్హత లేని వైద్యం!