ప్రైవేట్‌ పాఠశాలలదోపిడీని అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ పాఠశాలలదోపిడీని అరికట్టాలి

Jun 17 2025 6:55 AM | Updated on Jun 17 2025 6:55 AM

ప్రైవ

ప్రైవేట్‌ పాఠశాలలదోపిడీని అరికట్టాలి

నిజాంపేట(మెదక్‌): ప్రైవేట్‌ పాఠశాలల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జగన్‌ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కనీస వసతులు లేని ప్రైవేట్‌ స్కూళ్ల గుర్తింపు రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా స్కూళ్లు నడుస్తున్నాయని అన్నారు. పుస్తకాల పేరిట వ్యాపారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఫిట్‌నెస్‌ లేని బస్సులను అధికారులు వెంటనే సీజ్‌ చేయాలన్నారు. అనుమతి లేకుండా నోట్‌బుక్స్‌ విక్రయిస్తున్న ప్రైవేట్‌ పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఒకే దేశం..

ఒకే ఎన్నికతో మేలు

వెల్దుర్తి (తూప్రాన్‌): ఒకే దేశం.. ఒకే ఎన్నికతో ఆర్థిక భారం తగ్గి, తద్వారా దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మండలంలోని బస్వాపూర్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశ ప్రజలంతా ఒకే దేశం, ఒకే ఎన్నిక కార్యక్రమానికి మద్దతు తెలిపాలని సూచించారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్‌ ఎన్నికలతో కలిపి జరిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు బాలకిషన్‌, వెంకటేశం, నవీన్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పంట మార్పిడితో

అధిక దిగుబడి

రామాయంపేట(మెదక్‌): పంట మార్పిడితో చీడ పీడల ఉధృతి తగ్గి పంట దిగుబడి పెరుగుతుందని ఏడీఏ రాజ్‌నారాయణ అన్నారు. సోమవారం రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందజేసి మాట్లాడారు. మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగంతో నేలలో భూసారం తగ్గి పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందన్నారు. ఆగ్రో రైతు సేవా కేంద్రంతో పాటు సహకార సంఘం కార్యాలయంలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

ఆ స్కూళ్ల గుర్తింపురద్దు చేయాలి: ఎస్‌ఎఫ్‌ఐ

మెదక్‌ కలెక్టరేట్‌: అక్రమంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అజయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం మెదక్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్‌లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, బెల్టులు, బ్యాగులు అమ్ముతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలు పరిష్కరిస్తాం

మెదక్‌ ఆర్డీఓ రమాదేవి

పాపన్నపేట(మెదక్‌): అసైన్‌మెంట్‌ భూముల సమస్యల పరిష్కారానికి రైతులు దరఖాస్తు చేసుకోవాలని మెదక్‌ ఆర్డీఓ రమాదేవి సూచించారు. సోమవారం మండలంలోని కొత్తపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరై మాట్లాడారు. పీఓటి, సాదాబైనామా, అసైన్‌మెంట్‌ భూముల విషయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అందుకనుగుణంగా రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భూ రికార్డులకు సంబంధించిన ఆధారాలను జత పర్చాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో సతీష్‌ కుమార్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రైవేట్‌ పాఠశాలలదోపిడీని అరికట్టాలి 
1
1/2

ప్రైవేట్‌ పాఠశాలలదోపిడీని అరికట్టాలి

ప్రైవేట్‌ పాఠశాలలదోపిడీని అరికట్టాలి 
2
2/2

ప్రైవేట్‌ పాఠశాలలదోపిడీని అరికట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement