సాగు నీటిపై స్పష్టత ఇవ్వాలి
మాజీ మంత్రి హరీశ్‌రావు
మెదక్‌మున్సిపాలిటీ: యాసంగి సాగుపై జిల్లా రైతాంగం తీవ్ర అయోమయంలో ఉందని, సాగునీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వా లని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గురువారం మెదక్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ బ లపరిచిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగూరు మరమ్మతులు వేసవిలో చేయాల్సి ఉండగా, నీటిని ఖాళీ చేయటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. సాగునీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్ర కటించి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 17 టీఎంసీల నీరు ఉంది, పంటను కాపాడుతూనే మరమ్మతులు చేసే అవకాశం ఉన్నా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతుల హక్కును కాపాడాలన్నారు. ఓట్ల కోసం పోలింగ్ బూత్‌ల దగ్గర కుర్చీలు వేసుకుని వంగి వంగి దండాలు పెట్టే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. యూరియా కష్టాలపై, గురుకులాల్లో పురుగుల అన్నంపై ఎందుకు కుర్చీ వేసుకుని నిలదీయలేదని ప్రశ్నించారు. పెన్షన్లు, రుణమాఫీకి పైసలు లేవు కానీ.. మెస్సీ కోసం, అందాల పోటీల కోసం రేవంత్‌రెడ్డి రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పద్మారెడ్డి, శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
నీళ్లు, విద్యుత్, ఎరువులు కావాలి
అన్నదాతలకు కావాల్సింది యాప్‌లు, మ్యాపులు కాదు.. నీళ్లు, విద్యుత్, ఎరువులని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కొత్త చట్టాల పేరుతో కౌలు రైతులు, యజమానుల మధ్య పంచాయతీలు పెడు తున్నారన్నారు. అక్షరాస్యత లేని రైతులు, స్మార్ట్‌ఫోన్లు లేని మహిళా రైతులు యాప్‌లు, మ్యా పులు ఎలా వాడతారని ప్రశ్నించారు.


