కారు.. టాప్ గేరు
● 80 సర్పంచ్ స్థానాలు కై వసం
● 70 స్థానాలకే పరిమితమైన హస్తం
● 26 చోట్ల స్వతంత్రుల విజయబావుటా
● 7 స్థానాలతో సరిపెట్టుకున్న కమలం
తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటింది. ఆ పార్టీ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించారు. తొలి, రెండో విడతలో హస్తం హవా కొనసాగింది. మూడో విడతలో మాత్రం వెనుకబడింది. బీఆర్‌ఎస్‌కు గట్టి పోటీనిచ్చింది. కేవలం 7 సర్పంచ్ స్థానాలతో బీజేపీ తన ఉనికిని చాటుకుంది. పలు గ్రామాల్లో స్వతంత్రులు విజయబావుటా ఎగురవేశారు.
–నర్సాపూర్/మెదక్‌జోన్
తుది విడత ఎన్నికలు నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట 7 మండలాల్లో నిర్వహించారు. మొత్తం 183 పంచాయతీలు ఉండగా, ఇందులో 22 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయిన విషయం విదితమే. మిగిలిన 161 సర్పంచ్ స్థానాలకు బుధవారం పో లింగ్ జరిగింది. ఏకగ్రీవాలతో కలిపి 80 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం సాధించగా, అధికార కాంగ్రెస్ పార్టీ 70 స్థానాలకు పరిమితం అయింది. 26 స్థానాల్లో స్వతంత్రులు సత్తా చాటారు. కేవలం 7 చోట్ల బీజేపీ మద్దతుదారులు గెలిచారు.
సొంత ఇలాఖాలో హవా
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ పట్టు నిలుపుకొంది. పలు మండలాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఎన్నికలు జరిగాయి. పలుచోట్ల కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించగా, కొన్ని మండలాల్లో బీఆర్‌ఎస్ పట్టు నిలుపుకొ ంది. బీజేపీ నామమాత్రపు స్థానాలకు పరిమితమైంది. నర్సాపూర్ మండలంలో నువ్వా నేనా.. అన్నట్లు పోరు సాగింది. పలుచోట్ల రెండు పార్టీల నుంచి రెబల్స్ పోటీ చేశారు. 35 పంచాయతీల్లో రెండు ఏ కగ్రీవం అయ్యాయి. అందులో ఒకటి కాంగ్రెస్‌కు ద క్కగా, మరోచోట స్వతంత్ర అభ్యర్థి ఎన్నికయ్యారు. మిగిలిన 33 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు చెరో 16 స్థానాలను సమానంగా దక్కించుకున్నారు. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కాగా ఏకగ్రీవమైన పంచాయతీ కాంగ్రెస్ ఖాతాలోకి రావడంతో సంఖ్య 17కు చేరుకుంది. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ స్వగ్రామం రెడ్డిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి పరువు కాపాడుకున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ సొంత గ్రామమైన గొల్లపల్లిలో తన సమీప బంధువు మాధవి బీజేపీ మద్దతుతో పోటీ చేయగా ఆమైపె కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు.
● ఎమ్మెల్యే సునీతారెడ్డి సొంత మండలం శివ్వంపేటలో బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్‌లు గెలుపొందినప్పటికీ, ఆమె సొంత గ్రా మం గోమారంలో మాత్రం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. మండలంలోని 37 పంచాయతీలకు గాను మూడు ఏకగ్రీవమయ్యాయి. వాటిలో బీఆర్‌ఎస్ రెండింటిని దక్కించుకోగా, ఒక స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. కాగా చాలా గ్రామాల్లో పోరు ర సవత్తరంగా సాగింది. బీఆర్‌ఎస్ 19 పంచాయతీలను దక్కించుకొని ఆధిక్యంలో నిలువగా, కాంగ్రెస్ 16 స్థానాల్లో గెలుపొందింది. కాగా అల్లీపూర్‌లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించగా, గుండ్లపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
● ఇక చిలప్‌చెడ్ మండలంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేరో 9 స్థానాలు స్థానాలు దక్కించుకోగా, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కౌడిపల్లి మండలంలో 35 పంచాయతీల్లో ఏడు ఏకగ్రీవం కావడంతో 28 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి సొంత గ్రామమైన మండల కేంద్రంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కృష్ణాగౌడ్ గెలుపొంద డం గమనార్హం. ఏకగ్రీవాలను కలుపుకొని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేరో 14 14 స్థానాలను దక్కించుకోగా, బూరుగడ్డ పంచాయతీ బీజేపీ, 2 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు.
● కొల్చారంలో బీఆర్‌ఎస్ సత్తాచాటింది. మండలంలో 21 పంచాయతీలకు గాను మూడు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 18 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. రెండు ఏకగ్రీవ పంచాయతీలను కలిపి మండలంలో బీఆర్‌ఎస్ 11 పంచాయతీలు కై వసం చేసుకోగా, కాంగ్రెస్ ఒక ఏకగ్రీవ పంచాయతీతో కలిపి 5 స్థానాలకు పరిమితమైంది. రెండు చోట్ల బీజేపీ గెలువగా, 3 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.
● మాసాయిపేట మండలంలో 13 పంచాయతీల్లో ఒకటి ఏకగ్రీవం కావడంతో 12 జీపీలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో నాల్గు స్థానాల్లో గెలుపొందాయి. కా గా బీజేపీ ఒక స్థానం దక్కించుకోగా, మూడు పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవమైన పంచాయతీ సైతం స్వతంత్ర అభ్యర్థి ఖాతాలో చేరింది.
● వెల్దుర్తి మండలంలో బీఆర్‌ఎస్ సత్తా చాటింది. 23 పంచాయతీలు ఉండగా 4 ఏకగ్రీవం అయ్యాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్‌కు దక్కగా, మూడు స్థానాల్లో స్వతంత్రులు ఎన్నికయ్యారు. మిగిలిన 19 పంచాయతీలకు ఎన్నికలు జ రుగగా, ఏడు చోట్ల బీఆర్‌ఎస్, కాంగ్రెస్ 4 చోట్ల గెలుపొందింది. కాగా బీజేపీ 2 స్థానాల్లో, 6 పంచాయతీల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం.
కారు.. టాప్ గేరు


