ప్రశాంతంగా ముగిసిన పల్లె పోరు
ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో మూడు విడతలుగా నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వా తావరణంలో ముగిశాయని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రజలు, పోలీస్ అధికారులు, ఇతర శాఖల సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు మొత్తం 750 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల తేదీలు ఖరారైన నాటి నుంచే జిల్లావ్యాప్తంగా నిబంధనలు కఠినంగా అమలు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టామన్నారు. బు ధవారం వరకు రూ. 47. 48 లక్షలు నగదు, 268 కేసుల్లో సుమారు రూ. 26.46 లక్షల విలువ గల 3,688 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. గత ఎన్నికల్లో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి ముందస్తుగా 1,122 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు సిబ్బంది చలిని సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు.


