ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దు
రామాయంపేట(మెదక్): పట్టణంలోని అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో బూజు పట్టిన పాపడ్‌లు.. గడువు మీరిన సాస్ బాటిళ్లను జిల్లా అహార భద్రత అధికారి స్వదీప్‌కుమార్ స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఆయన బుధవారం హోటల్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో పట్టుబడిన నాసిరకం పదార్థాలను ధ్వంసం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సూపర్ మార్కెట్లు, హో టళ్లు, బార్లతో పాటు ఐస్‌క్రీం పార్లర్లలో తనిఖీలు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొ న్నారు. ఈమేరకు అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట ఫుడ్ శాంపిల్స్ సహాయ అధికారి నజీర్, సిబ్బంది ఉన్నారు.


