కాంగ్రెస్ పాలనలో ప్రగతి శూన్యం
తూప్రాన్: రెండున్నర ఏళ్లలో గ్రామాల్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మండలంలో బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బుధవారం హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను వారు ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభంజనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నారు. తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను పోలీసుల సహకారంతో కాంగ్రెస్ నాయకులు అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదన్నారు. వారికి అండగా నిలిచి కాపాడుకుంటామని భరోసా కల్పించారు.
పెద్దశంకరంపేట(మెదక్): పెద్దశంకరంపేట మండల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నా రు. బుధవారం పెద్దశంకరంపేటలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ఉపసర్పంచ్ రాజుగౌడ్‌తో పాటు వార్డు సభ్యులను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూ చించారు. కార్యక్రమంలో నా యకులు మురళిపంతులు, నారాగౌడ్, సంగమేశ్వర్, బాసాడ రాజు, సుభాశ్‌గౌడ్, సర్పంచ్‌లు పెరుమాండ్లుగౌడ్, కుమా ర్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: ప్రమాదంలో మృతిచెందిన కార్మికుడి కుటుంబానికి పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఎంఎస్ అగర్వాల్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికై నా చనిపోయి న కార్మికుడి కుటుంబానికి రూ. లక్ష ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల కిందట ఇదే పరిశ్రమలో ఒక కార్మికుడు చనిపోయాడని తెలిపారు. కానీ యజమాన్యం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్ట డం లేదని వాపోయారు. ఆయన వెంట జిల్లా సహాయ కార్యదర్శి సంతోశ్ ఉన్నారు.
తూప్రాన్: జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని పట్ట ణ కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులను సన్మానించా రు. ఈసందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ.. 1982 డిసెంబర్ 17న జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుతో పెన్షనర్లకు భద్రత కలిగిందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయ కులు కిష్టయ్య, రామకిష్ణయ్య, ముత్యా లు, జగతయ్య రాములు, అండాలమ్మ, నాగభూషణం, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్: ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి మండిపడ్డారు. బుధవారం గజ్వే ల్‌లో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజివిక మిషన్ పేరుతో బిల్లును తీసుకువస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో ప్రగతి శూన్యం
కాంగ్రెస్ పాలనలో ప్రగతి శూన్యం
కాంగ్రెస్ పాలనలో ప్రగతి శూన్యం


