యూరియా కోసం బారులు
నిజాంపేట(మెదక్): మండల కేంద్రంలో యూ రియా కోసం రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. గురువారం నిజాంపేట సొసైటీతో పాటు మరో రెండు ఫర్టిలైజర్ దుకాణాలకు 3 లారీల యూరియా వచ్చింది. రైతులు భారీగా తరలివచ్చా రు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. యాసంగి సీజన్‌లో రైతులకు అందుబాటులో యూరియా ఉంచాలని కోరారు. భూమి లేని వారు సైతం వచ్చి యూరియా తీసుకొని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు వాపోయారు. పట్టాపాస్ పుస్తకం ఆధారంగా అవసరం మేరకు అధికారులు పంపిణీ చేయాలన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌లో అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


