మల్లన్న సాగర్‌ను సందర్శించిన ఏసీపీ
తొగుట(దుబ్బాక): మండలంలోని కొమురవెల్లి మల్లన్న సాగర్‌ను గజ్వేల్ ఏసీపీ నర్సింహు లు సోమవారం సందర్శించారు. పంప్‌హౌస్, రిజర్వాయర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణం, సాగు నీరు, తాగునీటి వినియోగానికి సంబంధించి న సమాచారాన్ని డీఈ చెన్ను శ్రీనివాస్ ఏసీపీకి వివరించారు. అంతకు ముందు లింగాపూర్ శివారు లోని వైష్ణవి కన్‌స్ట్రక్షన్స్‌కు సంబంధించిన ఎక్స్‌ఫ్లోజీవ్ (డిటోనెటర్లు భద్రపరిచే) గోదాంను ఏసీపీ పరిశీలించారు. గోదాంకు సంబంధించిన అనుమతి పత్రాలు, స్టాక్ రికార్డులను ఆయన పరిశీలించారు. గోదాములో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. గోదాం వద్ద సెక్యూరి టీని ఏర్పాటు చేయాలని ఏసీపీ సూచించారు.


