జ్యోతి బాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జ్యోతి బాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలి

Nov 29 2026 2:23 PM | Updated on Nov 29 2026 2:23 PM

మంచిర్యాలక్రైం: మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని మంచిర్యాలలో ఏర్పాటు చేయలని భారత రాజ్యాంగ రక్షణ సమితి జిల్లా అధ్యక్షడు వేముల కిరణ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక ఐబీ చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేసిన మహా త్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. పూలే జయంతి వేడుకల వరకు మంచిర్యాలలో పూలే విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు. పూలే జయంతి ఉత్సవాల వాల్‌పోస్టర్లు ఆవిష్యరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్‌, యుగేందర్‌, సాయి, లక్ష్మణ్‌, తులా మధుసూదన్‌రావు, శ్రీనివాస్‌, బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement