కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు, మాజీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు, ఆదివాసీ అధికారి రాష్ట్రీయ మంచ్ జాతీయ వైస్ చైర్మన్ బృందాకారత్ శనివారం సందర్శించారు. ఆమె పాఠశాలలోని వంటగది, భోజనశాలను పరిశీలించారు. ఆమె విద్యార్థులతో మాట్లాడి ఎక్కడ పడుకుంటున్నారు. ఎలా ఉంటున్నారని స్వయంగా తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా, పుస్తకాలు అన్ని ఇచ్చారా..? యూనిఫాం ఎన్ని జతలు ఇచ్చారు.. అన్న విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పాఠశాలలోని సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వి ద్యార్థుల సమస్యలను ఆమె మొబైల్‌లో నోట్ చేసుకున్నారు. సీపీఐ(ఎం) నాయకులు, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


