ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని బనార్‌వాడలో శని వారం జరిగిన అగ్ని ప్రమాదంలో బోయిరె బాలాజీ కి చెందిప రేకుల ఇల్లు దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఉదయం కూలీ పని కోసం వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లోని గ్యాస్ లీకేజీతో పాటు షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల వారు గమనించి బిందెలతో నీటిని తెచ్చి మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో రూ.30 వేల నగదు, తులం వెండి, టీవీ, పట్టాపాస్‌బుక్కులు, ఇతర పత్రాలతో పాటు రూ. 2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే ఇల్లు కాలి బూడిదైంది.


