షార్ట్‌ సర్క్యూట్‌తో కిరాణా షాపు.. | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో కిరాణా షాపు..

Nov 29 2026 2:23 PM | Updated on Nov 29 2026 2:23 PM

ఆసిఫాబాద్‌క్రైమ్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలోని కౌసర్‌నగర్‌ బోర్డు సమీపంలో ఓ కిరాణా షాపులో శనివారం ప్రమాదవశాత్తు షార్ట్‌ సర్య్కూట్‌తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కనకయ్య అనే వ్యాపారికి చెందిన ఈ కిరాణా షాపులో మధ్యాహ్నం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో సమీప షాపు యజమానులు, స్థానికులు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అదుపులోకి రాలేదు. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా తక్షణమే స్పందించి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌ స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ భీమయ్య మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. లీడింగ్‌ ఫైర్‌ ఫైటర్‌ ఆర్‌సీ మండల్‌, టెక్నికల్‌ ఫైర్‌ ఫైటర్‌ ఖలీల్‌, ఫైర్‌ ఫైటర్‌ యుగేందర్‌, దుర్గాప్రసాద్‌లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement