ముగిసిన చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌

Nov 29 2026 2:23 PM | Updated on Nov 29 2026 2:23 PM

మంచిర్యాలఅర్బన్‌: స్థానిక గర్మిళ్ల పాఠశాలలో శనివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్‌ముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాస్థాయి చెకుముకి పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికై న వారి వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. ప్రభుత్వ ఇంగ్లిష్‌ మీడియం విభాగంలో జన్నారం మండలం కిష్టాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రథమ స్థానంలో నిలువగా.. శ్రీహిత, ఉదయ్‌, అనన్య రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాల విభాగంలో స్థానిక ఎంజేపీ ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రథమ స్థానం సాధించగా.. శన్విత, ప్రిన్సి, వైశాలి రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు. ప్రభుత్వ తెలుగు మీడియంలో భీమారం జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రథమ స్థానం.. పి.కీర్తన, చరణ్‌తేజ్‌ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ప్రైవేట్‌ పాఠశాలల విభాగంలో నస్పూర్‌ ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ విజేతగా నిలువగా అక్షిత్‌ వర్మ, సాయిత్రీ, సౌమ్యచంద్రిక ఎంపికయ్యారు. విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, జేవీవీ కన్వీనర్‌ కిష్టయ్య, ప్రధానోపాధ్యాయుడు నాగరాజ్‌వర్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement