శ్రీరాంపూర్: సింగరేణి ఉద్యోగులు, విశ్రాంత కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గల సింధు హాస్పిటల్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఆదివారం సింగరేణి కోఆర్డినేటర్ డాక్టర్ బాలకోటయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించడం హర్షణీయమన్నారు. సింగరేణి కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అలవందర్ వేణుమాదవ్, హాస్పటల్ సీఈవో డాక్టర్ ఆంథోనీ లాజర్ బాసిల్, మార్కెటింగ్ సిబ్బంది సురేష్ కుమార్, నాగవంశీ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


